తిరుమల: భక్తులకు గుడ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

తిరుమల: భక్తులకు గుడ్‌ న్యూస్‌

Published Sun, Apr 10 2022 10:26 AM

Two Years Later The Resumption Of Tirumala Special Darshans - Sakshi

తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేసింది. టికెట్లు పొందిన భక్తులకు శనివారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించింది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయం పక్కనున్న తిరుమల నంబి ఆలయం వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసింది. అలాగే రాంభగీచా నుంచి ప్రత్యేక క్యూ వరకు వెళ్లేందుకు శ్రీవారి సేవకులతోపాటు బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement