ఇద్దరి అరెస్ట్
తిరుపతి క్రైమ్: తిరుపతిలో మైనర్ బాలిక (12)పై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ లో పీలేరుకు చెందిన బాలు(20), గుణ(26) పరిచయమయ్యారు. వీరు బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 9న పీలేరుకు పిలిపించుకున్నారు. అక్కడ ఓరోజు ఉండి తిరిగి పీలేరు నుంచి తిరుపతిలోని విద్యానగర్‌కు వచ్చారు.
అక్కడ వారికి తెలిసిన ఓ మహిళ వద్దకు తీసుకువెళ్లి తమ బంధువు అని బాలికను పరిచయం చేశారు. 9న బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తిరుపతిలో ఉందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే గుర్తించి వారి నుంచి బాలికను తీసుకువచ్చేశారు. బాలిక వచ్చిన అనంతరం ఆమెను పోలీసులు విచారించగా..తనపై ఇద్దరూ లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసి ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.


