విషాదం నింపిన క్రికెట్‌ బెట్టింగ్‌

Two Committed Suicide With Cricket Betting In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని బెల్లంకొండలో విషాదాన్ని నింపింది. బెట్టింగ్‌ నిర్వహించి అప్పులపాలవ్వడంతో ఇద్దరు యువకుల ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్‌, కొమరయ్య  పురుగుల మందు సేవించగా.. తొలుత 10న సురేష్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతి చెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ప్రాణం తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌.. సెల్ఫీ వీడియోతో!)

అయితే గ్రామస్థుల సమాచార ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ డబ్బులు కట్టాలంటూ బుకీ ఒత్తిడి తెవడంతోనే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top