breaking news
bellam palle
-
విషాదం నింపిన క్రికెట్ బెట్టింగ్
సాక్షి, గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని బెల్లంకొండలో విషాదాన్ని నింపింది. బెట్టింగ్ నిర్వహించి అప్పులపాలవ్వడంతో ఇద్దరు యువకుల ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్, కొమరయ్య పురుగుల మందు సేవించగా.. తొలుత 10న సురేష్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతి చెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. సెల్ఫీ వీడియోతో!) అయితే గ్రామస్థుల సమాచార ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ డబ్బులు కట్టాలంటూ బుకీ ఒత్తిడి తెవడంతోనే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. -
బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఎం
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్(డీఎం) ఆశిష్ అగర్వాల్ శనివారం ఉదయం సందర్శించారు. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అగర్వాల్ తొలి పర్యటనగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో ప్రయాణికుల వసతులను పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా అప్రమత్తతతో పని చేయాలని సిబ్బందికి సూచించారు.