పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయంలో కేసులో ట్విస్ట్‌ | Twist In Pedakakani Temple Gold Ornament Missing Case | Sakshi
Sakshi News home page

పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయంలో కేసులో ట్విస్ట్‌

Sep 2 2026 5:28 PM | Updated on Sep 2 2026 6:10 PM

Twist In Pedakakani Temple Gold Ornament Missing Case

సాక్షి, గుంటూరు: పెదకాకాని ఆలయ మంగళ సూత్రం మాయంలో కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అర్చకుడు రణధీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై రణధీర్‌ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 20 రోజులుగా రణధీర్‌ను పోలీసులు వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని.. దొంగతనం ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశారంటూ రణధీర్‌ తల్లి మల్లేశ్వరి ఆరోపించారు. ‘‘ఇంట్లో సోదాల పేరుతో మంగళసూత్రం పెట్టారు. రణధీర్‌ను దొంగగా చిత్రీకరిస్తున్నారు. మా అబ్బాయి దొంగతనం చేయలేదు’’ అని రణధీర్‌ తల్లి పేర్కొన్నారు.

అమ్మవారి మంగళసూత్రం తానే దొంగతనం చేశానని రణధీర్‌ను ఒప్పుకోమని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. మేము కోర్టులో హెబియస్‌ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేశాము. ఈ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులు రణధీర్‌ను వదిలేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులు బలవంతంగా మా ఇంట్లో ప్రవేశించారు. ఇళ్లంతా సోదా చేస్తున్నట్టు హడావుడి చేశారు. మా అబ్బాయి దొంగకు కాదు. మంగళసూత్రం దొంగతనం చేయలేదు. పోలీసులే మా ఇంట్లో మంగళసూత్రం పెట్టి.. రణధీర్ దొంగతనం చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. దయచేసి మా అబ్బాయిని కాపాడండి’’ అంటూ రణధీర్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement