టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Mon, Sep 26 2022 4:55 PM

top10 telugu latest news evening headlines 26th September 2022 - Sakshi

1. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్‌
మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాల్సిందే!’
రాజస్థాన్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో రాజస్థాన్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నాకున్న ఫాలోయింగ్‌ మీకు తెలియట్లేదు.. నా పవర్‌ ఆరోజు తెలుస్తుంది: శశిథరూర్‌
కాంగ్రెస్‌ పార్టీలో కోల్డ్‌ వార్‌ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీని టెన్షన్‌కు గురిచేస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్‌ ఐటీలో కేటీఆర్‌ ఏమన్నారంటే?
కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్‌ మెస్‌లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రామ్‌ చరణ్‌ ఇంట క్రికెటర్ల సందడి, వైరల్‌గా ఫొటోలు
హీరో రామ్‌ చరణ్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించిన  సందర్భంగా ఇండియన్‌ క్రికెట్‌ టీంను అభినందిస్తూ తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే..
దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ తెలుసా?.. ఛాతీతో పాటు చాలాచోట్ల! ఒంట్లో ఇలా అనిపిస్తే జాగ్రత్త పడండి
అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఆరోగ్యంగా ఉన్నాడే అనిపించే మనిషి.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్‌ కార్డు కట్‌!
రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌!
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కార్తికేయ-2 ఓటీటీలో వచ్చేది అప్పుడే.. డేట్‌ ఫిక్స్‌
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం​ కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement