
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో మార్క్‌ఫెడ్ జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు మంచి ధర లభించిందని ఆయన అన్నారు. రఘునాథ్ బాబు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మార్కెటింగ్‌లో జోక్యం చేసుకోవడం వల్ల రైతులు అధిక ధరకు అమ్ముకోగలిగారని, దీనివల్ల రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ‘అది మీ తండ్రులు, తాతల వల్ల కూడా కాదు’