ఆడుకుంటూ.. అనంతలోకాలకు..  | Three Year Old Boy Deceased After Falling In Boiling Milk | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూ.. అనంతలోకాలకు.. 

Jan 16 2021 9:07 AM | Updated on Jan 16 2021 9:07 AM

Three Year Old Boy Deceased After Falling In Boiling Milk - Sakshi

ప్రణీత్‌ (ఫైల్‌)

బద్వేలు అర్బన్‌: మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లెలో పండుగ పూట విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. అనంతలోకాల కు వెళ్లాడు. వేడిపాలు ఉంచిన దబరాలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. మడకలవారిపల్లెకు చెందిన కొప్పరపు సురేష్, శ్రావణి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారు కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం బి.మఠం మండలం పలుగురాళ్ళపల్లెలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అక్కడ భోజనాల నిమిత్తం పెరుగు కోసం పాలను వేడి చేసి, పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఉంచారు. ఈ సమయంలో సురేష్‌ చిన్న కుమారుడైన ప్రణీత్‌ (3) ఆడుకుంటూ వెళ్లి వేడి పాలలో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే కోలుకోలేక శుక్రవారం ఉదయం బాలుడు మృతి చెందాడు.   

Advertisement
 
Advertisement
Advertisement