breaking news
Hot milk
-
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
బద్వేలు అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లెలో పండుగ పూట విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. అనంతలోకాల కు వెళ్లాడు. వేడిపాలు ఉంచిన దబరాలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. మడకలవారిపల్లెకు చెందిన కొప్పరపు సురేష్, శ్రావణి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారు కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం బి.మఠం మండలం పలుగురాళ్ళపల్లెలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అక్కడ భోజనాల నిమిత్తం పెరుగు కోసం పాలను వేడి చేసి, పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఉంచారు. ఈ సమయంలో సురేష్ చిన్న కుమారుడైన ప్రణీత్ (3) ఆడుకుంటూ వెళ్లి వేడి పాలలో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే కోలుకోలేక శుక్రవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. -
వేడి పాలు మీదపడి బాలుడి మృతి
అల్వాల్ : మూడేళ్ల పసి బాలుడు వేడి పాలు మీదపడి మృత్యువాత పడ్డాడు. ఎస్ఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం... మచ్చబొల్లారం గణేష్ నగర్లో నివసించే మల్లేష్ స్థానికంగా తోపుడు బండిపై లస్సీ విక్రయిస్తుంటాడు. శుక్రవారం నాడు రోజు మాదిరిగానే పాలు తీసుకువచ్చి వెడల్పాటి గిన్నెలో వేడి చేసి ఇంట్లో ఉంచాడు. మల్లేష్ కుమారుడు కౌశిక్ (3) ఇంట్లో ఆడుకుంటూ వేడి చేసిన పాలగిన్నె వద్ద పడిపోయాడు. దీంతో వేడి పాలు ఒంటి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.