వేడి పాలు మీదపడి బాలుడి మృతి | 3 years old boy dies in freak accident | Sakshi
Sakshi News home page

వేడి పాలు మీదపడి బాలుడి మృతి

Mar 19 2016 8:17 PM | Updated on Sep 3 2017 8:08 PM

మూడేళ్ల పసి బాలుడు వేడి పాలు మీదపడి మృత్యువాత పడ్డాడు.

అల్వాల్ : మూడేళ్ల పసి బాలుడు వేడి పాలు మీదపడి మృత్యువాత పడ్డాడు. ఎస్‌ఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం... మచ్చబొల్లారం గణేష్‌ నగర్‌లో నివసించే మల్లేష్ స్థానికంగా తోపుడు బండిపై లస్సీ విక్రయిస్తుంటాడు. శుక్రవారం నాడు రోజు మాదిరిగానే పాలు తీసుకువచ్చి వెడల్పాటి గిన్నెలో వేడి చేసి ఇంట్లో ఉంచాడు.

మల్లేష్ కుమారుడు కౌశిక్ (3) ఇంట్లో ఆడుకుంటూ వేడి చేసిన పాలగిన్నె వద్ద పడిపోయాడు. దీంతో వేడి పాలు ఒంటి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement