కొత్తగా మరో మూడు జిల్లాలు | Three more new districts will be formed in the state | Sakshi
Sakshi News home page

కొత్తగా మరో మూడు జిల్లాలు

Nov 26 2025 4:18 AM | Updated on Nov 26 2025 4:18 AM

Three more new districts will be formed in the state

ఇక జిల్లాలుగా పోలవరం, మదనపల్లె, మార్కాపురం 

రంపచోడవరం కేంద్రంగా ఒకే ఒక్క నియోజకవర్గంతో పోలవరం జిల్లా

ప్రస్తుత పోలవరం ఏలూరు జిల్లాలోనే కొనసాగింపు

మొత్తంగా 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య

కొత్తగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు.. ఇప్పుడున్న వాటిలో మార్పులు

రాష్ట్ర ప్రభుత్వం ఖరారు..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా పోలవరంతోపాటు మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయా­లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పోల­వరం ప్రాంతంలో ఎలాంటి మార్పులు చే­య­కుండా ఏలూరు జిల్లాలోనే కొనసాగించనుంది. ప్ర­స్తు­తం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంప­చోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు కలిపి కొ­త్తగా పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయ­ను­న్నా­రు. 

జిల్లాల పునర్విభజన కోసం ఏర్పా­టైన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సచివాల­యంలో మంగళ­వారం చర్చించి ఖరారు చేశారు. కొత్తగా ఏర్పాట­య్యే ఈ మూడు జిల్లాలతో రా­ష్ట్రంలోని జిల్లాల సంఖ్య  29కి పెరగ­నుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 

అనకా­పల్లి జిలా­్ల­­లో నక్క­పల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పా­ట­య్యే మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లా­లో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడ­కశిర రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు­కు నిర్ణయం తీసు­కు­న్నారు. కర్నూలు జిల్లా ఆదో­ని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరి­వాణం మండలాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

3.49 లక్షల జనాభాతో పోలవరం జిల్లా
పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాను విడగొట్టి పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజక­వర్గంతో 3.49 లక్షల అతి తక్కువ జనాభాతో ఈ జిల్లా ఏర్పాటవుతోంది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లా ఇదే కాబోతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో రంపచోడవరం, దేవీపట్నం, వై రామ­వరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడు­మిల్లి, రాజవొమ్మంగి మండలాలు.. చింతూరు డివిజన్‌లోని యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. 

ప్రకాశం జిల్లాను విడగొట్టి కొత్తగా మార్కాపురం జిల్లా 
ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం, కని­గిరి రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జి­ల్లా ఏర్పాటు కానుంది. యర్రగొండపాలెం, మా­ర్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజక­వర్గా­లు ఈ జిల్లాలో ఉండనున్నాయి. 

మార్కా­పురం రెవె­న్యూ డివిజన్‌లోని యర్రగొండపాలెం, పుల్లలచె­రువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దార­వీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనక­న­మిట్ల మండలాలు.. కనిగిరి డివిజన్‌లోని హను­మంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లో­పల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బెస్తవారి­పేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధ­వీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. 

పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లా
మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజక­వర్గా­లు ఈ జిల్లాలో ఉండనున్నాయి. మదనపల్లె రెవె­న్యూ డివిజన్‌లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రా­మ­సముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీ­రొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండ­లాలు.. పీలేరు డివిజన్‌లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. 

చెదిరిపోతున్న 17 జిల్లాలు
ఈ పునర్వ్యస్థీకరణతో 17 జిల్లాలు చెదిరిపోతు­న్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా ఏర్పాటైన జిల్లాల స్వరూపం చాలా వరకు మారిపోనుంది. విజ­య­నగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జర­గ­లేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాద­నలను ఈ నెల 28వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు.

డివిజన్లు, మండలాల్లో మార్పులు
» శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలపనున్నారు.
» అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని మండ­లాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది.
»  కాకినాడ డివిజన్‌లోని సామర్లకోట మండలా­న్ని పెద్దాపురం డివిజన్‌లో కలుపుతున్నారు.
» అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవ­రం, కపిలేశ్వరపురం, మండలాలను రాజ­మహేంద్రవరం డివిజన్‌లో కలపనున్నారు.
» పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవీ పెనుగొండ మండలంగా మారనుంది.
»   బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజక­వర్గా­న్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. అ­ద్దం­కి, దర్శి నియోజకవర్గాలతో కొత్తగా అ­ద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. 
» కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో ఉన్న మర్రి­పూడి, పొన్నలూరు మండలాలను కందు­కూరు రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు.
» కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. 
» నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లో కలపనున్నారు.
» పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లో కలుపుతున్నారు. 
» సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది.
» పలమనేరు డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు.
» వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు. 
» శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు.
» కదిరి డివిజన్‌లోని ఆమడగూరు మండలా­న్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్‌లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్‌­లో కలపనున్నారు. 
» నంద్యాల జిల్లా డోన్‌ రెవెన్యూ డివిజన్‌లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల.. నంద్యాల డివిజన్‌లోని సంజామల, కొలిమి­గుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement