గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో కోడి పందాల బరిలో టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. పందెం కోడికి కత్తి కట్టే విషయంపై గొడవ మొదలై తన్నుకునే వరకూ వెళ్లింది. గుడ్లవల్లేరులో టీడీపీ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
అయితే కోడి కత్తికి కట్టే విషయంలో రెండ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వెనుతురుమిల్లి, వసుమర్రు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. గొడవ ముదరడంతో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఒకరి పై ఒకరు కుర్చీలు, కర్రలతో దాడి చేసుకున్నారు.


