కోబాక: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం కోబాకలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కోబాకలో వైఎస్సార్‌సీపీ నేత గుణశేఖర్‌పై టీడీపీ కార్యకర్త సుదర్శన్ దాడికి పాల్పడ్డాడు. గుణశేఖర్‌ను బైక్‌తో ఢీకొటటి దాడి చేశాడు సుదర్శన్. సుదర్శన్ దాడిలో గాలి గుణశేఖర్ నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుణశేఖర్ నాయుడ్ని ఎంపీ గురుమూర్తి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పచ్చ మూకలు దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్నే లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు దిగుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉంది కదా అని గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న కూటమి నేతలు.. అంతు చూస్తామని తమకు ఎదురుతిరిగిన వారిని బెదిరిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీస్ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. తాజాగా దాడి ఘటనలో టీడీపీ కార్యకర్త సుదర్శన్‌పై పోలీసులు ఎంతవరకూ చర్యలు తీసుకుంటారో చూడాలి.


