స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా

Nov 25 2025 6:58 AM | Updated on Nov 25 2025 7:00 AM

పెంచి పోషిస్తున్న అధికార పార్టీ నేతలు టీటీడీ రెవెన్యూ, ఎస్టేట్‌ అధికారుల అండదండలు ఆస్పత్రిలో వివాదాస్పదమైన మెడికల్‌ షాపుల వ్యవహారం టీటీడీ బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌, తిరుపతి: టీటీడీ స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియాను అధికార పార్టీ నేతలు పెంచి పోషిస్తున్నారు. దీనికితోడు టీటీడీ బోర్డులోని ము ఖ్యులు వారికి చేతులు కలపడంతో వ్యవహారం మ రింత ముదిరింది. ఫలితంగా ఇక్కడ మెడికల్‌ షాపు ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. స్విమ్స్‌ క్యాజువాలిటీ మెడికల్‌ షాపు–3 డిఫాల్ట్‌ అని విజి లెన్స్‌ నిగ్గు తేల్చింది. అంతేకాకుండా ఆ మెడికల్‌ షాప్‌ను రద్దు చేయాలని బోర్డు సైతం నిర్ధారించింది. అయినా టీటీడీ రెవెన్యూ, ఎస్టేట్‌ అధికారుల అండదండలతో ఇప్పటికీ కొనసాగిస్తుండటం చర్చనీయాంశమైంది.

రోగుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. డిఫాల్టర్‌గా ఉన్న ఓ మెడికల్‌ షాపునకు కొంత మంది అధికార పార్టీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆ షాప్‌ యజమాని నాసిరకం మందులతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. డిఫాల్టర్‌ అని విజిలెన్స్‌ తేల్చినా ఆ షాపును కొనసాగించడమే కాకుండా మరోవైపు పద్మావతి ఆస్పత్రి మెడికల్‌షాపుపై ఉక్కుపాదం మోపి శనివారం అర్ధాంతరంగా తొలగించారు. దీంతో పద్మావతి రోగులు మందుల కోసం పరుగులు తీయాల్సి వస్తోంది.

స్విమ్స్‌ క్యాజువాలిటీ సమీపంలో మెడికల్‌ షాప్‌ –3 పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల టీటీడీ విజిలెన్స్‌ విచారణ జరిపింది. టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, నాసిరకం మందులు విక్రయిస్తున్నారని, కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించి టీటీడీ బోర్డుకు నివేదిక పంపింది. ఆడిట్‌ రిపోర్టులోను మెడికల్‌ షాప్‌ అక్రమాలకు పాల్పడుతోందని తేల్చారు. అలానే సకాలంలో టీటీడీకి అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తుండడంతో ఆ మెడికల్‌ షాప్‌ను డిఫాల్ట్‌ కింద పరిగణించారు. నివేదిక ఆధారంగా ఆ షాప్‌ను రద్దు చేయాలని అక్టోబర్‌ 28న బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు ఆదేశాలను అమలు చేయడంలో టీటీడీ రెవెన్యూ, ఎస్టేట్‌ విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయి. అక్రమార్కులకు టీడీపీ, జనసేన నేతలు అండగా నిలవడంతో ఆ షాప్‌ కొనసాగుతోంది.

స్విమ్స్‌ శ్రీ పద్మావతి మెడికల్‌ కళాశాల సమీపంలోని మెడికల్‌ షాప్‌ను టీటీడీ రెవెన్యూ అధికారులు శనివారం మూసివేశారు. టెండర్‌ కాల పరిమితి తీరడంతో దీనిని మూయిస్తున్నామంటూ అప్పటికప్పుడే నోటీసులు జారీ చేసి క్షణాల్లో సీల్‌ వేశారు. ఈ షాపును బెంగళూరుకు చెందిన జయదేవ్‌ ఫార్మా కంపెనీ 2022 మేలో టెండర్‌ ద్వారా దక్కించుకుంది. మూడేళ్ల కాలపరిమితి ఈ ఏడాది మే నెలలో ముగిసింది. తదుపరి టెండర్‌ ప్రక్రియను నిర్వహించకపోవడంతో రోగుల అత్యవసరం దృష్ట్యా తదు పరి టెండర్‌ ఖరారు అయ్యేవరకు జయదేవ్‌ ఫార్మా నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అయినా స్విమ్స్‌ డిఫాల్ట్‌ మెడికల్‌ షాప్‌ యజమానికి మేలు చేకూర్చేలా టీటీడీ పద్మావతిలోని మెడికల్‌ షాపును ఉన్నఫళాన మూసివేయడం విమర్శలకు దారి తీసింది.

పద్మావతి మెడికల్‌ కళాశాల ప్రాంగణంలోని మెడికల్‌ షాపునకు కాల పరిమితి ముగిసింది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటివరకు టీటీడీ నాలు గు పర్యాయాలు టెండర్లు పిలిచింది. స్విమ్స్‌ డిఫాల్టర్‌గా ముద్రపడిన ఫార్మా కంపెనీకి పద్మావతిలోను కట్టబెట్టేందుకు అధికారులు ఎత్తులు వేస్తున్నారు. టీటీడీ టెండర్‌లో పాల్గొనేందుకు ఇన్నోవేటివ్‌ లీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అర్హత కో ల్పోయింది. అయినా ఆ కంపెనీకి పద్మావతి ఆసుపత్రిలోని మెడికల్‌ షాపును కట్టబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు పర్యాయాలు టెండర్లు పిలిచినా నిబంధనలు వారికి అడ్డుగా మారాయి. ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఇన్నోవేటివ్‌ లీ కంపెనీ అత్యధికంగా కోడ్‌ చేసింది. ఈ కంపెనీకి అర్హత లేకపోవడంతో తరువాతి స్థానంలో రూ. 26 లక్షల అద్దెతో కీర్తి మెడికల్స్‌ నిలిచింది. అయినా టీటీడీ అధికారులు టెండర్‌ను నాన్చుతున్నారు. ఇన్నోవేటివ్‌ కంపెనీపై ప్రేమతోనే టీటీడీ ఇలా వ్యవహరిస్తుందనే విమర్శలొస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థ ఒక మెడికల్‌ షాప్‌కు టెండర్‌ నిర్వహించే సత్తా లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

శ్రీ పద్మావతి ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించి ఓిపీడీ, ఓటీ ప్రక్రియ జరుగుతోంది. 1050 బెడ్ల సామర్థ్యంతో పద్మావతి ఆస్పత్రి ఉంది. జయదేవ్‌ ఫార్మా కంపెనీకి తాళం వేయడంతో రోగులకు శాపంగా మారింది. వందలాదిమంది రోగులు మందుల కోసం స్విమ్స్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. అత్యవసర మందులకు సైతం కిలోమీటర్‌ దూరం రోగుల సహాయకులు పరుగులు పెడుతున్నారు. వెరసి టీటీడీ ఉదాశీన ధోరణి, అధికారుల వ్యవహార శైలి రోగులు, వారి సహాయకులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

స్విమ్స్‌లోని పద్మావతి ఆస్పత్రి, క్యాజువాలిటీ సమీపంలో విజయవంతంగా కొనసాగుతున్న డిఫాల్ట్‌ ముద్రపడ్డ మెడికల్‌ షాప్‌ ఇదే

ఒక టెండర్‌ నిర్వహించలేరా?

పద్మావతిలో మెడికల్‌ షాప్‌ మూత

అడ్డదిడ్డంగా నిర్వహణ

పద్మావతి రోగుల పరుగు

నిగ్గు తేల్చిన విజిలెన్స్‌

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా 1
1/2

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా 2
2/2

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement