పరిష్కార మార్గం చూపండి
తిరుపతి అర్బన్: అర్జీలను చూసిపంపడం కాకుండా వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రతి విభాగానికి చెందిన అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 288 అర్జీలు వచ్చాయి. అందులో మేజర్‌గా రె వెన్యూ సమస్యలపై 196 వినతులను అధికారులు అందుకున్నారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆ ర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, పలు విభాగాలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. అలాగే తిరుచానూరు పంచాయతీలోని యోగిమల్లవరం చెరువు ఆక్రమణకు గురైందని సీపీఎం నేతలు జయంద్ర, సుమన్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రీవెన్స్‌లో అటెండర్ల పెత్తనం
ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో పది మందికి పైగా వి విధ విభాగాలకు చెందిన అటెండర్లకు డ్యూటీలు వే స్తున్నారు. అయితే వారు వెనుక వచ్చిన వారిని ముందుగా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులను కలవడానికి పంపేస్తున్నారు. దీంతో క్యూలో ఉంటున్న అర్జీదారులు మండిపడుతున్నారు. ఉదయం 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటలైనా తా ము క్యూలో ఉంటే ఇలా అడ్డదారిలో పంపడమేమిటని ప్రశ్నించారు. దీంతో అర్జీదారులకు, అటెండర్లకు వాగ్వావాదం చోటుచేసుకుంది.
పెచ్చులూడి పడిన శ్లాబు
కలెక్టరేట్‌లో సోమవారం మరుగుదొడ్ల సమీపంలో బీ బ్లాక్‌కు మెట్ల మార్గంలో వెళ్లే చోట పెద్ద ఎత్తున స్లాబ్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడ్డాయి. అ యితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఊడిపడిన పెచ్చులను ఎ ప్పటికప్పుడు ఓ పారిశుద్ధ్య కార్మికురాలు శుభ్రం చేయడంతోపాటు అక్కడే ఉండి ఆ మార్గంలో ఎవ రూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మా బిడ్డకు 85శాతం వైకల్యం ఉంది
మా బిడ్డ లక్ష్మీనరసింహాకు 85శాతం వైకల్యం ఉంది. సదరన్ సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ ఇప్పించాలని బాలాయపల్లి మండలం వెంగమాంబపురానికి చెందిన ఉమామహేశ్వరి, గోపి దంపతులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఉపాధి కూలి ఇప్పించండి
ఉపాధి కూలీలకు నగదు ఇప్పించాలని నాగలాపు రం మండలానికి చెందిన కూలీలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. పది వారాలుగా చేసిన పనికి కూలీ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. వారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ధర్నాలో పాల్గొన్నారు.
మా సమస్యలను పట్టించుకోరా?
మా సమస్యలను పట్టించుకోరా? అంటూ ఏపీ స మగ్రశిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ స్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సో మవారం ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించలేదన్నారు. డిసెంబర్ 10న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్
జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్ ఉండాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద బీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
కరెంట్ మీటర్ ఇప్పించండి..
కరెంట్ మీటర్ ఇప్పించాలతని సీతారం ఏచూరి నగర్ వాసులు కలెక్టరేట్ వద్ద సోమ వారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ పరిధిలోని సీతారం ఏచూరి నగర్‌లో ఇళ్లు నిర్మించుకుని రెండేళ్లుగా నివాసం ఉంటున్నామని, కరెంట్ మీటర్ ఇవ్వాలని కోరారు.
పరిష్కార మార్గం చూపండి
పరిష్కార మార్గం చూపండి


