హాకీ విజేత కడప జిల్లా జట్టు
చంద్రగిరి:రాష్ట్రస్థాయి అండర్–14 బాలబాలికల హాకీ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్స్‌లో బాలబాలికల విభాగంలో కడప జట్టు విజేతగా నిలిచింది. స్థానిక చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో మూడు రోజులుగా 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 బాల, బాలికల స్కూల్ గేమ్స్ హాకీ పోటీల్లో జరుగుతున్నాయి. సోమవారం జరిగిన బాలుర ఫైనల్స్‌లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు, విశాఖ జట్టుపై 5–1 గోల్స్‌తో గెలి చి విన్నర్‌గా నిలిచి చాంపియన్ షిప్ ట్రోఫీని అందుకుంది. విశాఖ జిల్లా జట్టు రన్నర్‌గా ద్వితీయ స్థానంతో ట్రోఫీ అందుకుంది. అలాగే బాలికల ఫైనల్స్‌లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు, అనంతపురం జిల్లా జట్టుపై 4–1 గోల్స్‌తో విజయం సాధించి, చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది. అనంతపురం జిల్లా జట్టు ద్వితీయ స్థానంతో రన్నర్‌గా నిలిచింది.


