తిరుమలలో టీడీపీ కార్యకర్త ఓవరాక్షన్‌.. భక్తుల ఆగ్రహం

TDP Party Worker Displayed TDP Flag In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్‌ అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎల్లో బ్యాచ్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయి తాము ఏం చేస్తామో అనేది తెలియక.. పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు తిరుమలలో టీడీపీ జెండాతో ఓవరాక్షన్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు ఒకరు బరితెగించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు ప్రదర్శించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఎల్లో బ్యాచ్‌ అపవిత్ర కార్యక్రమాలకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పార్టీ జెండాను ప్రదర్శించడంపై సీరియస్‌ అవుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్‌ను ఎల్లో బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో, కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పిచ్చెక్కిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ జెండాలను ప్రదర్శిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్‌ పట్టువస్త్రాల సమర్పణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top