ప్రొద్దుటూరు: ప్రైవేటు పంచాయతీలు చేస్తున్న పోలీసులపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. ఉన్నతాధికారల ప్రమేయంతో పోలీసులు.. ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారని విమర్శించారు. దీనిలో భాగంగానే శ్రీనివాసులు అనే బంగారం వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్భందాన్ని కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎస్పీ స్తాయి కంటే పైఅధికారుల ప్రమేయంతో జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు వరదరాజులు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.


