ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇయ్యి: టీడీపీ నేత | TDP Leader Demands Amount On Granite Manager In Anantapur | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇయ్యి: టీడీపీ నేత

Feb 27 2021 4:44 PM | Updated on Feb 27 2021 5:00 PM

TDP Leader Demands Amount On Granite Manager In Anantapur - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇవ్వు అని గ్రానైట్‌ మేనేజర్‌ను ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి డిమాండ్‌ చేశాడు.

అనంతపురం: తెలుగు దేశం పార్టీ నాయకుడు బరి తెగించాడు. గ్రానైట్‌ మేనేజర్‌ను రూ.50 వేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేశానని.. వాటిని తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఘటన అనంతపురము జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురము జిల్లా కుర్తికోటలో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఓటుకు రూ.2 వేలు పంచానని.. ఆ డబ్బులు తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌ను శేఖర్‌ కోరాడు. దీంతో తనకల్లులో మారుతి గ్రానైట్‌ మేనేజర్‌ను బెదిరించాడు. నెలకు రూ.50 వేలు రౌడీ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బు కోసం ఈ విధంగా పట్టపగలు బెదిరింపులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement