మహిళలపై నేరాల్లో టాప్‌–3లో ‘టీడీపీ’ | TDP among the top 3 in crimes against women | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాల్లో టాప్‌–3లో ‘టీడీపీ’

Oct 26 2026 5:11 AM | Updated on Oct 26 2026 5:11 AM

TDP among the top 3 in crimes against women

ప్రాంతీయ పార్టీల వారీగా దేశంలోనే వెన్నుపోటు పార్టీ టాప్‌

ఆ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీపై కేసులు

సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ల విశ్లేషణలో సంచలన అంశాలు 

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడి 

మహిళల భద్రతపై చంద్రబాబు మాటల్లో డొల్లతనం బట్టబయలు

సాక్షి, అమరావతి: మహిళా రక్షణ, సాధికారతపై తరచూ గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ డొల్లతనం దేశవ్యాప్తంగా మరోసారి బట్టబయలైంది.  మహిళలపై  వివిధ రకాల వేధింపులు, దాడులు, ఇతర సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో దేశంలోనే టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల విశ్లేషణలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. వాటి తరువాత మూడో స్థానంలో ఉన్న వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ  ప్రాంతీయ పార్టీల వారీగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 

ఆ పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులు, ఒక ఎంపీపై మహి­ళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ప్రతిష్టాత్మక అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమ­నేని ప్రభాకర్‌పై ఏకంగా అత్యాచారం కేసు కూడా ఉంది.   మహిళల భద్రతకు పెద్దపీట వేస్తు­న్నామని చెబు­తున్న  ముఖ్య­మంత్రి చంద్రబాబు.. సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై నమోదైన ఈ కేసులపై ఏం సమాధానం చెబు­తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా­యి. 

మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల జాబితాలో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఉండటం ఆ పార్టీ నైతికతను ప్రశ్నిస్తోంది. మహిళలపై నేరారోపణలు ఎదు­ర్కొంటు­న్న వ్యక్తులకు రాజకీయాల్లో ప్రాధాన్యతనిస్తూ వారికి రక్షణ కల్పి­స్తున్న టీడీపీ తీరు­పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా­యి.

అరాచకాల్లో పచ్చనేతలు: అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక పేర్కొన్న ముఖ్యనేతల్లో చింతకా­యల అయ్యన్నపాత్రుడు (స్పీకర్‌),  మంత్రులు వంగలపూడి అనిత, సవిత, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు చింతమ­నేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు వంటి సీనియర్‌ నేతలు ఉన్నారు.

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. 
» మహిళలపై నేరాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్‌ 294 పేజీల విశ్లేషణను ఈ నెల 23న విడుదల చేసింది.   
» 2022 నుండి 2026 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు (ఎంపీలు, ఎమ్మె­ల్యేలు) భారత ఎన్నికల 
సంఘానికి సమర్పించిన ఫారం–26 అఫిడవిట్ల నుంచి ఈ సమాచారాన్ని విశ్లేషించింది.  
» దేశంలోని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 4,899 మంది ఎంపీ, ఎమ్మెల్యేల్లో 4,881 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్‌ విశ్లేషించింది. తద్వారా ఐదేళ్లలో నమోదైన కేసులను పరిశీలించింది.  
»  విశ్లేషించిన అఫిడవిట్లలో 772  ఎంపీలవికాగా, 4,109 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు ఉన్నాయి.  
» రాజీనామా, మరణం, ఇతర కారణాల వల్ల స్థానాలు ఖాళీ అవ్వడం ద్వారా జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషణ  ప్రక్రియలో ఏడీఆర్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement