సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు

Sucharitha Special Thanks To MLA Vasantha Krishna Prasad - Sakshi

హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచ దేశాల్లో బానిసత్వం ఉంటే.. మన దేశంలో అంటరానితనం చూశామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బిఆర్‌ అంబేద్కర్‌ ఎంతో శ్రమించారని, దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. ‘‘నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్‌ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. (చదవండి: హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత)

పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్‌’’ అని పేర్కొన్నారు. అంబేద్కర్‌, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top