Piduguralla: Student Dies Of Heart Attack; 2nd Case In 45 Days - Sakshi
Sakshi News home page

AP: విషాదం.. గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి

Apr 17 2023 8:29 AM | Updated on Apr 17 2023 10:49 AM

Student Died Of Heart Attack At Piduguralla - Sakshi

పిడుగురాళ్ల: పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటూ ఇక్కడే జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

శనివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్‌ సమయంలో కోటిస్వాములు తనకు ఊపిరి ఆడటం లేదని స్నేహితులకు చెప్పటంతో గాలి వీచే ప్రదేశంలో కూర్చోవాలని సూచించారు. వెంటనే గదిలోని ఫ్యాన్‌ కింద కూర్చునేందుకు వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న నలుగురు స్నేహితులు కోటిస్వాములను లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వాచ్‌మన్‌కు సమాచారం అందించారు.

వాచ్‌మన్‌ వచ్చి హాస్టల్‌ వార్డెన్‌కు తెలియజేయడంతో హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక పరీక్షలు చేసి కోటిస్వాములు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుత్తికొండలో ఉంటున్న బాలుడు తల్లిదండ్రులకు వార్డెన్‌ గోపీనాయక్‌ సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్‌ వద్ద బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement