11న బాధ్యతలు స్వీకరించనున్న సోము వీర్రాజు | Somu Veerraju Will Take Charge As AP BJP Chief On 11th August | Sakshi
Sakshi News home page

సోము వీర్రాజు పదవీ స్వీకారం, చీఫ్‌ గెస్ట్‌గా రాంమాధవ్‌

Aug 9 2020 2:48 PM | Updated on Aug 9 2020 3:16 PM

Somu Veerraju Will Take Charge As AP BJP Chief On 11th August - Sakshi

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలిపారు.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలిపారు. మంగళవారం జరుగనున్న ఈ పదవీ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అఖిల భారత సంఘటన్‌ సహ కార్యదర్శి సతీష్ జీ పాల్గొంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్ దియోడర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, పాకలపాటి సన్యాసిరాజు, అడ్డూరి శ్రీరామ్, పాలూరి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమ ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement