AP Government Tops In Skoch Gold Awards - Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్‌కు అరుదైన అవార్డు.. అధికారులకు సీఎం జగన్‌ ప్రశంసలు

Apr 27 2023 6:28 PM | Updated on Apr 27 2023 8:11 PM

Skoch Gold Award To Ap Government - Sakshi

 ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక గోల్డ్‌ అవార్డును స్కోచ్‌ సంస్థ ప్రదానం చేసింది.

సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక గోల్డ్‌ అవార్డును స్కోచ్‌ సంస్థ ప్రదానం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, ఆ రుణాలను సద్వినియోగం చేసుకోవటం.. సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఈ సహాయ సహకారాలకు గాను ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్ధ గోల్డ్‌ అవార్డు వరించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందేలా స్త్రీ నిధి సంస్థ కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  అవార్డులను అధికారులు చూపించారు. ఈ సందర్భంగా అధికారులను సీఎం ప్రశంసించారు.
చదవండి: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement