11న రెండో విడత అమ్మఒడి.. | Second Installment Amma Vodi Programme On January 11th | Sakshi
Sakshi News home page

11న రెండో విడత అమ్మఒడి

Jan 4 2021 9:37 PM | Updated on Jan 4 2021 9:43 PM

Second Installment Amma Vodi Programme On January 11th - Sakshi

సాక్షి, నెల్లూరు: ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మఒడి  కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సారి గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైనవారందరికీ కచ్చితంగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్‌ఐవోను బెదిరించిన నారాయణ కాలేజి డైరెక్టర్‌పై కేసు నమోదుకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. (చదవండి: ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు)

Advertisement
 
Advertisement
Advertisement