పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్‌కే | Sarpanchs Have Power To Grant Leave For Gram Panchayat Secretaries In AP | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్‌కే

Apr 2 2021 3:08 AM | Updated on Apr 2 2021 11:16 AM

Sarpanchs Have Power To Grant Leave For Gram Panchayat Secretaries In AP - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్‌లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్‌ 1నుంచి 5వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజువల్‌ సెలవులను సర్పంచ్‌ మంజూరు చేస్తారు. సచివాలయంలో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్లకు క్యాజువల్‌ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తారు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్‌ అసిస్టెంట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు.
చదవండి: ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement