గంగాధర నెల్లూరు: పంచాయతీ కార్యాలయంలో వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ సర్పంచ్ కుర్చీ మాత్రం మాయమైంది. ఈ ఘటన మండలంలోని కొండేపల్లి పంచాయతీ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పద్మాపురం రోడ్ వద్ద గల కొండేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత 15 రోజుల క్రితం దాదాపు రూ.20 వేల విలువ గల సర్పంచ్ గోవిందస్వామి కుర్చీ మాయమైంది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి చిట్టెమ్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆపై జీడీనెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరిపై అనుమానం ఉన్నట్టు సమాచారం.


