ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy Press Meet On Jagananne Maa Bhavishyathu - Sakshi

సాక్షి, అమరావతి: ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేపటి నుంచి ఏడు లక్షల మంది గృహ సారథులు కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్తారన్నారు. 

‘‘మమ్మల్ని మా జగన్ అన్న పంపారు అని చెప్పి పది నిమిషాలు మాట్లాడతారు. జగన్ ఇచ్చిన మెసేజ్ వారికి అందించి వెళ్తారు. అన్ని కులాలు, మతాలు, ఇతర రాజకీయ కుటుంబాలను కూడా కలుస్తారు. గతంలో పాలన ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా జరుగుతోందో? వారి అభిప్రాయాలు తీసుకుంటారు. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమం మేము చేస్తున్నాం. మీకు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ సాయం అందితేనే తనకు ఓటేయమని జగన్ అంటున్నారు. ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు’’ అని  సజ్జల అన్నారు. 

‘‘ఏ నెలలో ఏ సంక్షేమం అందించబోతున్నది కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. అప్పట్లో జన్మభూమి కమిటీ జలగలు ప్రజల్ని పీడించాయి. ఇప్పుడు లంచాలు లేకుండా అర్హతే ప్రమాణంగా సంక్షేమం అందిస్తున్నాం. గృహ సారథులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఐదు ప్రశ్నలు వేస్తారు. వారి నుండి జగన్ పాలనపై అభిప్రాయాలు తెలుసుకుంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ఆ తోడేళ్లవి ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top