
కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.
స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు.