AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మృతి | Road Accident On Special Deputy Collector Ramadevi | Sakshi
Sakshi News home page

AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మృతి

Apr 7 2025 11:17 AM | Updated on Apr 7 2025 11:52 AM

Road Accident On Special Deputy Collector Ramadevi

అన్నమయ్య జిల్లా,సాక్షి : సంబేపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ10బీఎఫ్‌ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవీ మరణించారు.

చిత్తూరు-కర్నూలు జాతీయ ‌రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న  స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement