రూ.3 కోట్ల విలువైన గృహం, రూ.66 లక్షల నగదు | Retired IRS officer will says assets should go to TTD | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన గృహం, రూ.66 లక్షల నగదు

Jul 25 2025 5:03 AM | Updated on Jul 25 2025 5:03 AM

Retired IRS officer will says assets should go to TTD

టీటీడీకి చెందాలని రిటైర్ట్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి వీలునామా

పత్రాలు, చెక్కులను అందజేసిన ట్రస్టీలు

తిరుమల: ఓ రిటైర్ట్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి తన మరణా­నంతరం టీటీడీకి చెందాలని రాసుకున్న వీలునామా ప్రకా­రం రూ.3 కోట్ల విలువైన భవనానికి సంబంధించిన ఆస్తి పత్రాలు, రూ.66 లక్షలు నగదుకు సంబంధించిన చెక్కులను ఆయన ట్రస్టీలు గురువారం టీటీడీకి అందజేశారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి వైవీఎస్‌ఎస్‌ భాస్క­ర్‌ రావు హైదరాబాద్‌ వనస్థలిపురంలో ‘ఆనంద నిల­యం’ పేరుతో రూ.3 కోట్లతో 3,500 చద­రపు అడు­గు­ల భవనాన్ని నిర్మించుకున్నారు. దా­న్ని, బ్యాంక్‌లో దా­చుకున్న రూ.66 లక్షలను తన మర­ణానంతరం ఆధ్యా­త్మిక కార్యకలాపాల కోసం విని­యో­గించాలని వీలు­నామా రాశారు. 

తను బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ములో టీటీడీ వేంకటేశ్వర అన్నప్ర­సాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, వేంకటేశ్వర సర్వ శ్రేయాస్‌ ట్రస్టుకు రూ.6 లక్ష­లు, వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంక­ల్పించారు. 

ఇటీవల ఆయన హైదరా­బాద్‌లో తుది శ్వాస విడిచారు. భాస్కర్‌ రావు అంతిమ కోరిక మేరకు ఆయన ట్రస్టీలు ఎం.దేవరాజ్‌ రెడ్డి, వి.సత్యనా­రాయ­ణ, బి.లోక­నాథ్‌లు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం తిరు­మలలో టీటీడీ ఏఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ ప్రైవేట్‌ లిమి­టెడ్‌ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు­కు గురువారం రూ.2 కోట్లు విరాళమిచ్చింది. సంబంధిత చెక్కులను ఏఈవోకి గురువారం అందజేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement