Reorganization in the AP Police Department - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పోలీస్‌శాఖలో పునర్‌వ్యవస్థీకరణ

Published Sun, Apr 3 2022 6:41 PM

Reorganization In The AP Police Department - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్‌శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 48 అడిషనల్‌ ఎస్పీలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది.

చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?

కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలు నియామకం
కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 47 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement