ఐదేళ్లు జైలుశిక్ష పూర్తయిన మహిళా ఖైదీల విడుదల 

Release Of Women Prisoners Who Have Completed Three Years In Prison - Sakshi

సాక్షి, అమరావతి: ఐదేళ్లపాటు జైలుశిక్ష పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా జీవిత ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. (చదవండి: బాలల బంగారు భవితకు సర్కార్‌ భరోసా)

దీనికి సంబంధించిన కసరత్తుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోంశాఖ), సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్శి(లీగల్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ అండ్‌ జస్టిస్, లా డిపార్ట్‌మెంట్‌), డీజీపీ లేదా డీజీపీ నామినేట్‌ చేసిన పోలీస్‌ అధికారి, ఏపీ సీఐడీ చీఫ్‌ లీగల్‌ అడ్వైజర్, జిల్లా జడ్జి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ, జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఉంటారు. సంబంధిత సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే వారి జాబితాను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. మహిళా జీవిత ఖైదీల్లో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు. (చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top