మానవత్వం చాటుకున్న మంత్రులు..  | Ministers Shift Accident Victim To Hospital | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న మంత్రులు 

Nov 6 2020 7:18 AM | Updated on Nov 6 2020 7:18 AM

Ministers Shift Accident Victim To Hospital - Sakshi

గాయపడిన నరసింహారావును పరామర్శిస్తున్న మంత్రులు సుచరిత, వనిత

తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): ఆటో ఢీకొని గాయాలపాలై రోడ్డుపక్కన పడి ఉన్న ఓ రైతును..అదే మార్గంలో వెళ్తున్న మంత్రులు పరామర్శించి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకెళితే.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కేబినెట్‌ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా, గుంటూరు జిల్లా ఉండవల్లి–అమరావతి కరకట్టపై ఇస్కాన్‌ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన గాయాలపాలైన ఓ రైతు కనిపించాడు. అది గమనించిన  మంత్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. తాను మోపెడ్‌పై తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటో అతను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడని బాధితుడు సమాధానమిచ్చాడు. దీంతో హోంమంత్రి సుచరిత తన కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని కేటాయించి ఆ రైతును తాడేపల్లి పట్టణ పరిధిలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌ చేసి వెంటనే అతనికి చికిత్స అందించాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement