అగ్నివీర్‌ నియామకాలకు నమోదు ప్రక్రియ ప్రారంభం | Registration process for Agniveer recruitment begins: AP | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌ నియామకాలకు నమోదు ప్రక్రియ ప్రారంభం

Mar 14 2025 6:20 AM | Updated on Mar 14 2025 6:20 AM

Registration process for Agniveer recruitment begins: AP

సాక్షి, అమరావతి: ఆర్మీ విభాగంలో అగ్నివీర్‌ సిబ్బంది నియామకానికి 2025–26కు నమోదు ప్రక్రియ చేపట్టినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ కల్నల్‌ పునీత్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను మొదటి­సారి తెలుగుతో సహా 13 భాషల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అన్ని కేటగిరీల ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారు, ప్రతిభావంతులైన క్రీడాకారులు, అగ్నివీర్‌ టెక్నికల్‌ కేటగిరీలో ఐటీఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

 గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెలూ­్లరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకారం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులతో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ కార్యాలయ సహాయకులు/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ వృత్తి నిపుణుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏప్రిల్‌ 10లోగా www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement