ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది: రెడ్డీస్‌ ల్యాబ్‌ సతీష్‌ రెడ్డి

Reddys Labs Kallam Satish Reddy Comments In Global Investors Summit - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాస​ంగా కొనసాగుతున్నాయి. సమ్మిట్‌ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో​ ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా.. 

రెడ్డిస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్‌ చేసిన కృషి అమోఘం అని అన్నారు.

అవాడ గ్రూప్‌ ఛైర్మన్‌ వినిత్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ అప్రోచ్‌ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. నెంబర్‌ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. 

సెయింట్‌ గొబెయిన్‌ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. 

లారస్‌  ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ..  ఫార్మా రంగంలో​ ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్‌ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్‌ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నా​యి. 

నోవా ఎయిర్‌ సీఈఓ అండ్‌ ఎండీ గజానన్‌ నాజర్‌ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్‌ వన్‌. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. 

అపాచీ అండ్‌ హిల్‌టాప్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్‌ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు.  మూడు దేశాల్లో అపాచీ గ్రూప్‌ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్‌ విజనరీ లీడర్‌. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో​ డైనమిక్‌ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top