నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..! | Ram Gopal Varma Made Comments On Lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..!

Apr 21 2021 6:34 PM | Updated on Apr 21 2021 9:09 PM

Ram Gopal Varma Made Comments On Lokesh - Sakshi

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై ట్విటర్‌లో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తరచూ సోషల్‌ మీడియాలో ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిల్లుస్తుంటారు. రాజకీయ నాయకులైన, సినీ ప్రముఖలపై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతారు. కాగా ఈసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్‌ అనే వైరస్‌ పట్టిందన్నారు. ఈ వైరస్‌కు విరుగుడిగా జూనీయర్‌ ఎన్టీఆర్‌ అనే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా జూనీయర్‌ ఎన్టీఆర్‌ వ్యాక్సిన్‌ను వెంటనే పార్టీకి వేయించాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. లేకపోతే మీ పని అంతే! అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

చదవండి: ఎన్టీఆర్‌, అఖిల్‌ల వీడియోపై ఆర్‌జీవీ కామెంట్స్‌ వైరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement