అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు చాన్స్‌ | Rain forecast for two days in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు చాన్స్‌

Oct 25 2021 5:48 AM | Updated on Oct 25 2021 5:48 AM

Rain forecast for two days in Andhra Pradesh - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలోనూ కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement