చిత్తూరులో సైకో వీరంగం

A Psycho Hulchul On Police Officials In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో సురేష్‌ సైకో ప్రవర్తనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి అతని పట్టుకోవడానికి  ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సురేశ్‌ చేతిలో ఉన్న కర్రతో  పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  చికిత్స నిమిత్తం చిత్తూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో కూడా సురేష్‌ సిబ్బందిపై దాడి చేయబోయాడు. సురేష్ పై  ఇది వరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.


 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top