సకాలంలో నివేదికలిస్తే బాధితులకు సత్వర న్యాయం

Prompt justice for victims if timely reporting - Sakshi

ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా

విజయవాడలో నిర్వహించిన విచారణలో రూ.80 లక్షల మేర పరిహారాలకు సిఫార్సు

స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులకు అభినందనలు 

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయ­వా­డ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు డాక్టర్‌ డి.ఎం.మూలే, రాజీవ్‌ జైన్, విజయభారతి సయాని, సెక్రట­రీ జనరల్‌ భరత్‌ లాల్, రిజి్రస్టార్‌(లా) సురాజి­త్‌ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివి­ధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమా­వేశమయ్యారు. అనంతరం ఎన్‌హెచ్‌­ఆర్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగి­న ఆదేశాలు జారీ చేశామని చెప్పా­రు. రూ.­80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్‌–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివార­ణ తదితర అంశాలపై కార్యాచర­ణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మా­నవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యా­దు చేయవచ్చన్నారు.

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా 
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అరుణ్‌మిశ్రా బుధ­వారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్‌ అరుణ్‌మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

పంచహారతుల సేవ­లో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొ­న్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆ­శీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్‌ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదా­లు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్య­క్రమంలో కలెక్టర్‌ ఢిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top