గ్రామంలోకి నో ఎంట్రీ.. అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం

Pregnant Gives Birth To Baby In Ambulance For Villagers Not Allowed That In Village - Sakshi

సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్‌ భయం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ప్రాణ భయంతో మంచి,చెడులు మరిచిపోతున్నారు జనం. ప్రాణం మీదకు వచ్చినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. వివరాలు.. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామస్తులు.. గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్‌ ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు వచ్చింది. కానీ, గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ను అనుమతించలేదు. దీంతో ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేలోగా లలిత బాబుకు జన్మనిచ్చింది. ప్రజలు కరోనా భయంతో అంబులెన్స్‌ను గ్రామంలోకి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top