టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామంలో పేకాట

Police Raid on Poke Base at Uravakonda - Sakshi

టీడీపీ నేత ఆధ్వర్యంలో నిర్వహణ 

ఆ పార్టీ నేతలతో సహా 56 మంది అరెస్ట్‌ 

రూ.10.51 లక్షల నగదు స్వాధీనం

ఉరవకొండ: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పలువురు టీడీపీ నేతలతో సహా 56 మందిని అరెస్ట్‌ చేశారు. రూ.10.51 లక్షల నగదు, ఐదు కార్లు, 14 బైక్‌లు, 54 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండలో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్‌లు మీడియాకు వివరాలు వెల్లడించారు.

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున పేకాట సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సీఐ శేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. వై.రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు, రౌడీషీటర్‌ ఎర్రిస్వామి, కౌకుంట్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శీనా సహా 56 మందిని అరెస్ట్‌ చేశారు. వీరంతా బెళుగుప్ప, కౌకుంట్ల, వై.రాంపురం తదితర గ్రామాలకు చెందిన వారు. టీడీపీ ముఖ్య నేత బోయ మారెప్ప ఆధ్వర్యంలో  పేకాట స్థావరం కొనసాగుతున్నట్టు గుర్తించారు. 

చదవండి: (ఈ పాపం బాబుది కాదా?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top