భిక్షాటన చేసుకునే దివ్యాంగుడిపై పోలీసుల దాడి | Police Assault on Disabled Beggar Sparks Outrage In Vijayawada | Sakshi
Sakshi News home page

భిక్షాటన చేసుకునే దివ్యాంగుడిపై పోలీసుల దాడి

Apr 24 2026 9:12 PM | Updated on Apr 24 2026 9:15 PM

Police Assault on Disabled Beggar Sparks Outrage In Vijayawada

విజయవాడ: అతను భిక్షగాడే కాదు.. దివ్యాంగుడు కూడా. అవేమీ పోలీసులకు కనిపించలేదు. అతన్ని చితక బాదారు. వాతలు తేలేలా కొట్టారు పోలీసులు. ఇదెక్కడో కాదు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై.   ఆ దివ్యాంగ భిక్షగాన్ని కొట్టింది ఇంద్రకీలాద్రి ఔట్‌పోస్ట్‌ పోలీసులు.

బ్రహ్యం అనే వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటుండగా పోలీసులు అతన్ని చితక్కొట్టారు. అతను అయ్యప్ప మాలలో సైతం ఉన్నాడు. 

ఓ భిక్షగాడిని, అందులోనూ దివ్యాంగుడైన అతన్ని అంతలా కొట్టాల్సిన అవసరం లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. కర్రలతో వాతలు తేలేలా కొట్టడంతో చేసేది లేక మళ్లీ పోలీసులకే ఫిర్యాదు చేశాడు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement