ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి

Pila Sominaidu Says Setting Up Donors Cell For Development Of Kanaka Durga Temple - Sakshi

సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

అదే విధంగా  ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి  ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top