తెరమీద చంద్రబాబు, పవన్‌.. తెర వెనుక ఆయన: పేర్ని నాని | Perni Nani Slams Coalition Govt for Ignoring Home Guards Plight | Sakshi
Sakshi News home page

తెరమీద చంద్రబాబు, పవన్‌.. తెర వెనుక ఆయన: పేర్ని నాని

Jul 7 2026 4:02 PM | Updated on Jul 7 2026 4:37 PM

Perni Nani Slams Coalition Govt for Ignoring Home Guards Plight

బందరు: హోంగార్డుల సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు.

‘‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తెరమీద కనిపిస్తారు. తెర వెనుక లోకేశ్‌ ఉంటారు. హోంగార్డుల జీతం నెలకు రూ.21 వేలు. హోంగార్డులకు రూ.18 వేలు ఉండే జీతాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.21 వేలకు పెంచారు. 

నెలకు రెండు రోజుల సెలవుతో హోంగార్డులకు రూ.21 వేల జీతం ఇచ్చారు. కానిస్టేబుళ్లు నిర్వహించే విధులనే హోంగార్డులు నిర్వహించాలి. హోంగార్డులు ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు’’ అని పేర్ని నాని చెప్పారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement