
సాక్షి, తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల పర్యటనలో ఉన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా అన్నా లెజినోవా సోమవారం వేకువ జామున శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
అయితే, తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు.
VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan’s wife Anna Lezhneva offered prayers at Tirumala Temple in Tirupati district.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/QQ41ZI1Jjy— Press Trust of India (@PTI_News) April 14, 2025