
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ యువతి పుట్టిన రోజు వేడుకలు శ్రుతి మించాయి. నగర నడిబొడ్డున సిరిపురం జంక్షన్‌లో బర్త్ డే వేడుకలు పేరుతో విద్యార్థులు హంగామా సృష్టించారు. సుమారు 30 మంది వరకు యువకులు.. యువతి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు.
అయితే, కేకులు కట్ చేసి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. రోడ్లపై గన్ ఫైర్ క్రాకర్స్‌తో పరిగెత్తుకుంటూ వాహనదారులపై కేకులు విసురుతూ హల్‌చల్ చేశారు. వీరి విపరీత చేష్టలకు వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.