
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే
డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు డిమాండ్
చిత్తూరు కలెక్టరేట్/ఏలూరు టూటౌన్ : కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని డీఎస్సీ– 2023 ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు ఆపస్, ఎస్టీయూ, యూటీఎఫ్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతునిచ్చారు. అనంతరం డీఆర్వో మోహన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ– 2023 ఉపాధ్యాయుల ఫోరం కనీ్వనర్ బోడె మోహన్ యాదవ్ మాట్లాడుతూ డీఎస్సీ– 2003లో ఎంపికై ప్రభుత్వ విధానపరంగా 2004లో విధుల్లో చేరిన తమకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్)అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,900 మంది ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కారు తక్షణం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇది ప్రభుత్వానికి అశనిపాతమే అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర అ««ద్యక్షులు బాలాజీ, డీఎస్సీ–2023 ఉపాధ్యాయుల ఫోరమ్ నాయకులు మధు, ఢిల్లీప్రకాష్, శ్రీధర్, కోదండరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు చేసిన ధర్నాకు ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మద్దతు పలికారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ సాయి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్, ఫ్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, పశ్చిమగోదావరి జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్.రవికుమార్, పవన్ కుమార్, ఇ.రామ్మోహన్, టి.రామారావు, ఐ.రమేష్, ప్రధానోపాధ్యాయ సంఘ నాయకులు జి.ప్రకాష్‌రావు, డీఎస్సీ 2003 రాష్ట్ర కన్వీనర్ కట్టా శ్రీనివాసరావుతోపాటు దాదాపు 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు.
వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు
సాక్షి, అమరావతి: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నం.57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఓప్రకటనలో డిమాండ్ చేసింది. దేశంలోని 16 రాష్ట్రాలు ఇప్పటికే ఈ ఉత్తర్వులను అమలు చేశాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్ రెడ్డి, సు«దీర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశంపై మీనమేషాలు లెక్కించకుండా వెంటనే అమలు చేయాలన్నారు. ఈ విషయంలో 2003 ఉపాధ్యాయుల పోరాటానికి వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.