
ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్
సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థినులకు అవకాశం
సాక్షి, అమరావతి: విద్యార్థినులకు ఆర్థిక సహాయార్థం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ‘ప్రగతి స్కాలర్ షిప్’లను అందిస్తోంది. ఈ పథకం సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మేరకు (ఆన్‌లైన్‌లో) అర్హత కలిగిన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహా్వనిస్తోంది. అక్టోబర్ 31లోగా జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్ https:// scholarships. gov.in/ ద్వారా దరఖాస్తులు సమర్పించాలంది. ఆధార్ బ్యాంకు లింకు చేసిన అకౌంట్‌ను జత చేయాలని పేర్కొంది.
ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉన్న వారు అర్హులు. ఇలా ప్రతి కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు బాలికల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఏఐసీటీ ఈ ఆమోదించిన సంస్థల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న (లేటరల్ ఎంట్రీ అయినా) విద్యార్థినులకు ఏడాదికి రూ.50వేలు చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. డిగ్రీ స్థాయిలో గరిçష్టంగా నాలుగేళ్లు ఇలా సహయాన్ని ఇస్తోంది. డిప్లొమాలో చేరిన విద్యార్థినులకు సైతం ఈ పథకాన్ని గరిష్టంగా మూడేళ్లు ఇవ్వనుంది. ఈ సహాయాన్ని ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్లు, స్టేషనరీ వంటి పరికరాల ఖర్చుల నిమిత్తం ఏక మొత్తంలో అందించనుండటం విశేషం.
అర్హులందరికీ...
దేశంలో 23 రాష్ట్రాల్లో ఏటా 10వేల స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. వీటికి అదనంగా 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిక ప్రాంతాల్లో ఎంత మంది అర్హత కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనుంది.
సమర్పించాల్సిన పత్రాలు (నకలు)..
⇒ ఎస్‌ఎస్‌ఈ ధ్రువపత్రం
⇒ హెచ్‌ఎస్‌సీ/12వ తరగతి (డిగ్రీ లెవల్ విద్యార్థినులకు)
⇒ ఐటీఐ ధ్రువపత్రం (డిప్లొమా విద్యార్థినులకు)
⇒ బ్యాంకు పాస్‌బుక్
⇒ కుల ధ్రువీకరణ పత్రం
⇒ ఆధార్ కార్డు
⇒ స్టడీ ధ్రువపత్రం
⇒ వార్షిక ఆదాయ ధ్రువపత్రం
⇒ తల్లిదండ్రుల డిక్లరేషన్
⇒ బ్యాంకు మ్యాన్‌డేట్ ఫారమ్