రఘురామకృష్ణరాజుకు నోటీసులు

Notice Issued to Raghurama Krishnaraju For Disqualification Complaint - Sakshi

పార్టీ ఫిరాయింపుల చట్టం కింద లోక్‌సభ సచివాలయం జారీ

సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్‌పై 15 రోజుల్లోగా జవాబు చెప్పాలని నోటీసులో పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఏడాది క్రితం ఆధార సహితంగా సభాపతికి ఫిర్యాదు చేసింది.

వైఎస్సార్‌సీపీ టికెట్‌ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతునారని, అందువల్ల ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌ సభ పక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి, పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ పలుమార్లు సభాపతికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధిన ఆధారాలను గతంలోనే సమర్పించారు. ఈ దృష్ట్యా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌ క్వాలిఫై చేయాలని ఇటీవల మరోసారి వారు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top